*అసాంఘిక కార్యకలాపాలపై మత్తు పదార్థాలపై జూదంపై ఉక్కు పాదం మోపుతాం*
*శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే శిక్షిస్తాం*
*ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన క్రాంతి కుమార్*
*జమ్మికుంట /ఇల్లందకుంట జులై 3 ప్రశ్న ఆయుధం*
అసాంఘిక కార్యకలాపాలపై మత్తు పదార్థాలపై జూదంపై ఉక్కు పాదం మోపుతామని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తామని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎం క్రాంతి కుమార్ అన్నారు ఇల్లందకుంట ఎస్ హెచ్ ఓ గా క్రాంతి కుమార్ బాధ్యతలు స్వీకరించి మీడియాతో మాట్లాడుతూ మండలంలో గల 18 గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన సహించేది లేదని యువత మత్తు పదార్థాలకు జూదాలకు అలవాటు అయ్యి కుటుంబాలను నాశనం చేస్తున్నారని మత్తు పదార్థాలపై జూదాలపై ఉక్కు పాదం మోపుతామని శాంతి భద్రతల పరిరక్షణ కొరకై కృషి చేస్తామన్నారు రాబోకాలంలో స్థానిక సంస్థలు ఎన్నికల దృశ్యం గ్రామాలలో ప్రజలు సోదర భావంతో మేదలాలని వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అత్యవసర సమయంలో 100 కి ఫోన్ చేయాలని ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలనిశాంతిభద్రతల పరిరక్షణలో పోలీసువారికి ప్రజలు సహకరించాలని కోరారు