*రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి*
*: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్*
అనంతపురం, డిసెంబర్
– *ఉరవకొండ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉరవకొండ నియోజకవర్గంలో రహదారుల పరిస్థితిపై ఆర్.అండ్.బి అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు.*
– *ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని ఆర్.అండ్.బి రహదారులు గుంతలు లేకుండా ఉండేలా చూడాలని, రహదారులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలను తక్షణం తీసుకోవాలన్నారు. రహదారుల అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు అందుకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్.అండ్.బి ఎస్ఈ రాజగోపాల్, డిఈ బాల కాటమయ్య, ఏఈ కావ్య పాల్గొన్నారు.