వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి

*వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి*

– *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్*

అనంతపురం, :

– *వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి అనంతపురం నగరంలోని ఆర్.అండ్.బి అతిథి గృహంలో అర్దబ్ల్యూఎస్ శాఖ పరిధిలో తాగునీటి సరఫరాపై సంబంధిత అధికారులతో మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు.*

– *ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఉదిరిపుకొండ నుంచి ఉరవకొండకు పైపులైన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించగా, మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. సిపిడబ్ల్యూ కూడేరు ప్రాజెక్టులో వాల్స్ రిపేరీలు ఉన్నాయని అధికారులు తెలుపగా, వాటిని వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా సమేత కాంట్రాక్టర్ తో మంత్రి ఫోన్లో మాట్లాడుతూ వెంటనే వాల్స్ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఉరవకొండ పట్టణంతోపాటు ప్రతి మండలంలో తాగునీటి సరఫరాకు సంబంధించి నెలకొన్న సమస్యలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కెనాల్ వాటర్ తో నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపి నిల్వ ఉంచుకోవాలని, నీటిమట్టం తగ్గకుండా చూసుకోవాలన్నారు.*

– *ఈ సమావేశంలో అర్దబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, ఈఈ మురళీధర్ రావు, డిఈ నిబాన్ సఫ్రీన, సత్యసాయి బోర్డు డిఈ రామారావు, జెఈలు ఐజయ్య, మిజామిల్, మంజునాథ్, నాగదివ్య, హర్ష, సత్యసాయి బోర్డు చౌదరి, భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.*

Join WhatsApp

Join Now