ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 3(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని రత్నాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా కావడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్తా అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం గ్రామానికి చేరుకున్న మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్రాగునీటి సరఫరా చేస్తామని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు.