వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా అడుగులు

*వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా అడుగులు*

*భ్రష్టుపట్టిన వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా చర్యలు*

*ఉపాధి కల్పనే లక్ష్యంగా ఉన్నత విద్యలో సంస్కరణలు!*

*ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, పరిశోధన, ప్రమాణాలకు పెద్దపీట*

*ఆరునెలల్లోనే అనూహ్య మార్పులకు మంత్రి లోకేష్ శ్రీకారం*

అమరావతి: ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆచరణాత్మకకంగా చూపుతున్నారు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలల్లో ఉన్నత విద్యారంగంలో సమూల ప్రక్షాళనకు నడుంకట్టారు నారా లోకేష్. రాబోయే అయిదేళ్లలో విద్యావ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలల్లో పరిశోధన, ప్రమాణాల మెరుగుదలకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో ఏళ్లతరబడి ఖాళీగా ఉన్న సుమారు 3,300 పోస్టుల భర్తీకి రూట్ మ్యాప్ రూపొందించారు. అనుసంధన్ ప్రాజెక్ట్ కింద పరిశోధనల ప్రోత్సాహానికి

Join WhatsApp

Join Now