లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 287 పాయింట్లు లాభపడి 81,373 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు ఎగబాకి 24,905 వద్ద ట్రేడవుతోంది. ఇక టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HDFC, యాక్సిస్ బ్యాంక్, టైటన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ITC, సన్‌ఫార్మా, మారుతీ, JSW స్టీల్, ఏషియన్ పెయింట్స్ ICICI, కోటక్ మహీంద్రా బ్యాంక్, L&T షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.