వాహనదారులకు ఇబ్బందిగా మారిన వరిధాన్యం పొట్టు నిల్వలు

*వాహనదారులకు ఇబ్బందిగా మారిన వరిధాన్యం పొట్టు నిల్వలు*

బెజ్జంకి మండల కేంద్రం నుండి కల్లేపెల్లి గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గంలో, ఇటుక తయారీ చేసే కేంద్ర నిర్వాహకుడు వరిధాన్యం పొట్టును మరియు కాల్చిన బూడిద ను రోడ్డు పక్కనే పెద్ద కుప్పగా పోసి, నిల్వ ఉంచడం వల్ల దాని పైన ఎలాంటి కప్పు లేకపోవడంతో, గత వారం రోజుల నుండి చలి గాలులు వీస్తున్న క్రమంలో వరి ధాన్యం పొట్టు, బూడిద గాలికి కొట్టుకుని వచ్చి అటునుండి వెళ్తున్న వాహదారుల పైన మరియు వారి కళ్ళల్లో పడి ఇబ్బందికి గురి అవుతున్నామని, ప్రతి రోజు ఈ రోడ్డు వెంట వందల మంది వాహనదారులు ప్రయాణం చేస్తారని కల్లేపల్లి గ్రామానికి చెందిన పలువురు వాహనదారులు తెలిపారు. అసలే రోడ్డు గుంతలమయంగా మారిందని దానికి తోడు వరి ధాన్యం పొట్టుతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను తీర్చాలని పలువురు గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment