దళితుల పై దాడులను ఆరికట్టండి
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు డిబిఎఫ్ విన్నపం
ఉమ్మడి మెదక్ జిల్లా బ్యూరో సెప్టెంబర్ 28 ప్రశ్న ఆయుధం :
మెదక్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ ల పై జరుగుతున్న దాడులను ఆరికట్టెందుకు చర్యలు తీసుకొవాలని ,ఎస్సి సంక్షేమ పధకాలను సక్రమంగా అమలు చేయాలని, జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ లో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పెట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు విన్నవించింది. శనివారంనాడు మెదక్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు డిబిఎఫ్ నేతలు దుబాషి సంజీవ్, దాసరి ఎగొండ స్వామి,హన్మకొండ దయాసాగర్,బ్యాగరి వేణుల బృందం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో చైర్మన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు దుబాషి సంజీవ్, దయాసాగర్,డిబిఎఫ్ రాష్ట్ర నేత దాసరి ఎగొండ లు మాట్లాడుతూ మెదక్ జిల్లా లో ఎస్టీ, ఎస్టీ ల పై దాడులు రోజు రోజు కు పెరిగిపొతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని,చట్టం ప్రకారం నిందితులకు శిక్షలు నామామత్రమేనన్నారు.బాధితులకు అందించాల్సిన తక్షణ సహయం, నష్టపరిహారం, పునరావాసం మొక్కుబడిగా అందజెస్తు చెతులు దులుపుకుంటున్నారన్నారు..
మనొహర్ బాద్ మండలం గౌతోజి గూడలో డప్పు కొట్టనందుకు దళిత కుటుంబం సామాజిక బహిష్కరణ కేసులో A 1 మాజి సర్పంచ్ వెంకటెశం, A2 మాజి ఉపసర్పంచ్ రెణుకుమార్ లను తదితరులను అరెస్టు చెయలేదని చైర్మన్ కి పిర్యాదు చేశారు..రక్షణ లేక కుటుంబం భయాందోళనలకు గురవుతునతనదని, ప్రధాన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని,బాధితులకు రక్షణ కల్పించాలని, నష్టపరిహారం అందించాలని రాష్ట్ర హైకోర్టు అదేశించిన జిల్లా యంత్రాంగం మొక్కుబడి చర్యలు తీసుకొని చెతులు దులపు కుందన్నారు
మెదక్ మండలం శమ్నాపూర్ లొ దళిత మహిళలు వినాయకుడికి కొబ్బరి కాయ కొట్టాడానికి వెళ్ళితే కులం పేరుతో అవమాన పరిచిన కేసులో నిందితులను అరెస్టు చెయలేదు.డిఎస్పి ఏకపక్షంగా విచారణ చెసి నిందితులను తప్పిస్తూ రాజకీయ గొడవలని అట్రాసిటి కేసును నీరు గారుస్తున్నారన్నారు.
అంబేద్కర్ విదేశి విద్యానిధి,బెస్ట్ అవలెబుల్ ,కులాంతార వివాహ జంటలకు ఆర్ధిక సహాయం, కల్యాణ లక్ష్మీ తదితర పధకాలు సక్రమంగా అమలు కావడం లేదన్నారు.
సంక్షేమ హస్టళ్ళు,గురుకులాలలో సమస్యలు రాజ్యమెలుతున్నాయని. కాస్మొటిక్ చార్జిలు నెల నెల అందించడంలెదని,.జిల్లా అధికారుల తనిఖీ లు,పర్యవేక్షణ లేకపోవడంతో.ఇటివల తూప్రాన్ గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థులే కొట్డుకునె పరిస్థితితులు దాపురించాయన్నారు.
మెదక్ జిల్లా కేంద్రం లో రొడ్డు విస్తరణలో పొస్టపిస్ చౌరస్తా లొ వున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.అర్.అంబేద్కర్ విగ్రహం తొలగించి సంవత్సరాలు దాటుతున్న నేటికి తిరిగి పెట్టడం లేదన్నారు
శివ్వంపేట మండలం కొంతన్ పల్లి గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను అరెస్టు చేయలేదన్నారు
మెదక్ పట్టణం లో వున్న ఎస్సీ కార్పొరేషన్ దుకాణ సముదాయాలు బినామిల పేరుతో కట్టబెడుతున్నారని,కొత్త చిరు వ్యాపారులకు,ఔత్సాహిక పారిశ్రామిక వెత్తలకు అవకాశాలు కల్పించడం లేదన్నారు. పౌర హక్కుల దినోత్సవం ప్రతి నెల నిర్వహించడం లేదన్నారు. తమ విన్నపానికి స్పందించిన చైర్మన్ దాడులను ఆరికట్టెందుకు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశిస్తామని హమి ఇచ్చారని డిబిఎఫ్ నేతలు తెలిపారు.