ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబర్ 11 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు మానుకొని ఆరు గ్యారెంటీలను అమలు కొరకు ప్రభుత్వం పై వత్తిడి తేవాలని మాజీ జడ్పీ కోఆప్షన్స్ సభ్యులు మన్సూర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీని, స్థానిక ఎమ్మెల్యేను వ్యక్తిగత దుషన చేయడాన్ని ఖండించారు. బిఆర్ఎస్ పార్టీ హయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నాం అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లోకి వచ్చి 11 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గులేకుండా ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన విమర్శించారు. కొల్చారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సునిత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షకు రైతుల నుండి విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉడికి పోతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే విమర్శించడం మానుకుని చేస్తున్న అభివృద్ధికి కలిసి రావాలని హితువు పలికారు.