చిరంజీవి వీరాభిమాని మద్దెల శివకుమార్
ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన అద్భుత చిత్రం గేమ్ చేంజర్ పై దుష్ప్రచారాలు మానివేయండి అన్నారు. విష సంస్కృతిని విడనాడి ఆ చిత్రాన్ని ఆశీర్వదించండి.
మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ పండించారు.
నవరసాలు కలబోసిన గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని మద్దెల
జోస్యం చెప్పారు.
సంక్రాంతి బరిలో దూకుడుగా వస్తున్న, మెగా పవర్ స్టార్ మరియు గ్లోబల్ స్టార్ అయిన మెగాస్టార్ ముద్దుల తనయుడు రామ్ చరణ్ ద్విపాత్రాభి న యంలో అద్భుతంగా నటించి జీవించి మెప్పించిన, మూవీ
యూనివర్సల్ మైటీ డైరెక్టర్ శంకర్ అద్భుతమైన లైవ్ డైరెక్షన్లో, సినిమాపై గొప్ప దిల్ ఉన్న, క్రియేటివ్ డైనమిక్ అండ్ గ్రేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో,తన విల నిజాన్ని అతి వికృతంగా ప్రదర్శించగలిగే ద గ్రేట్ యాక్టర్ అండ్ డైరెక్టర్ సూర్య పరిపక్వతతో కూడిన విలనిజం, బ్యూటీ అండ్ క్యూటీ కియారా అద్వానీ సోయగాలు అందచందాలు,అద్భుతమైన నటులు శ్రీకాంత్ ,సముద్రఖని , రాజీవ్ కనకాల మరియు అంజలి లాంటి భారీ తారాగణంతో, అద్భుతమైన పాటలు అత్యద్భుతమైన ఫైట్లు ,హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సునీల్ మరియు వెన్నెల కిషోర్ల హాస్య సన్నివేశాలు, ఆధునిక అద్భుత సంగీతంతో తన్మయత్వాన్ని కలిగించే తమన్ సంగీత సారధ్యంలో సామాజిక సమకాలీన పరిస్థితులను, సామాజిక రాజకీయ పరిస్థితులను మేళవించి,ఒక సామాజికమైన సందేశాన్ని అందిస్తూ, అద్భుతమైన రసకావ్యంగా, ఛాలెంజింగా,భారీ బడ్జెట్ తో , భారీ హంగులతో తీర్చిదిద్దిన గేమ్ చేంజర్ మూవీ అన్ని వర్గాల వారిని అలరించి, విశ్వవ్యాప్తంగా రికార్డులను అన్నిటినీ బ్రేక్ చేసి నంబర్ వన్ సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని,మెగా అభిమానులందరిని అలరించి సంక్రాంతి బరిలో నంబర్ వన్ సినిమాగా చరిత్రను సృష్టిస్తుందని, మెగాస్టార్ చిరంజీవి వీర విధేయ అభిమాని ,అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఉద్ఘాటించారు.
ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో, ఎన్నో అంచనాలతో, ఈనెల 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న,” గేమ్ చేంజర్ మూవీపై
మద్దెల శివకుమార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ,
ఈ మూవీని 90 శాతం మంది స్వాగతిస్తున్నారని, ఆనందం వ్యక్తం చేస్తున్నారని, బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తున్నారని,
కానీ ఒక 10 శాతం మంది మెగా ఫ్యామిలీ వ్యతిరేకులు , కొంతమంది అసూయాంధకారులు, కొన్ని రాజకీయ పక్షాలు, కూలగొట్టే మనస్తత్వం ఉన్న విచ్ఛిన్నకారులు మాత్రం సత్యదూరమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, వారి కుట్రలను మెగా అభిమానులు అందరూ తిప్పి కొట్టాలని,
వారికి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను,
అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు
మెగా వ్యతిరేక దద్దమ్మలు,మెగా పవర్ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్టును ఆపలేరు
మెగా పవర్ ఉన్న, సూర్యుని లాంటి దేదీప్యమాన కాంతి గల, చిరంజీవి మీద గాని, పవన్ కళ్యాణ్ మీద గాని, రామ్ చరణ్ మీద గాని, ఉమ్మి వేస్తే అది తమ మీదనే పడుతుందని, ఈ కుహనావాదులు ,ముష్కరులు గ్రహించాలని,
ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ హితవు పలికారు.
గేమ్ చాలెంజ్ సినిమాపై దుష్ప్రచారాలు* మానివేయండి
by Naddi Sai
Published On: January 9, 2025 9:38 pm