బరితెగింపు మాటలు ఆపండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
జమ్మికుంట ఇల్లందకుంట జూలై 26 ప్రశ్న ఆయుధం
బరితెగింపు మాటలతో ఎమ్మెల్యే వాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ప్రజల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నాడని నవ్వుల పాలు చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అన్నారు ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పాడి కౌశిక్ రెడ్డి, ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే తీరు రోజురోజుకు పాతాళానికి దిగజారుతోందని హుజురాబాద్ ఔన్నత్యాన్ని తన వ్యవహార శైలితో భాష తీరుతో బరితెగింపు వేషాలతో నవ్వుల పాలు చేస్తున్నాడని నాయకులు మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యల్ని చేయడమంటే ఇది ముమ్మాటికి కేసీఆర్ కుటుంబమే పాడి కౌశిక్ రెడ్డితో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను చేపిస్తున్నట్టుగా మేము భావిస్తున్నామని అన్నారు ఎందుకంటే గత పాలకులు బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ 10 ఏళ్లలో చేయని అభివృద్ధి, గత పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని నేడు 18 నెలల్లోనే చక్కదిద్ది అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల మెప్పు పొందడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందు వరుసలో ఉండడం చూసి ఓర్వలేక కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే పాడి కౌశిక్ రెడ్డితో ఇలాంటి అవాస్తవ సత్య దూరమైనటువంటి వ్యాఖ్యల్ని చేపిస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఎవరి మెప్పు కోసమో ప్రజా నాయకుల మీద ప్రజా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మంత్రివర్గం మీద అవాక్కులు చవాక్కులు పేలితే చూస్తూ ఊరుకోమని, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు నిరూపించకపోతే ఏ గ్రామంలో తిరగనివ్వమని భౌతిక దాడులు కూడా వెనుకాడమని హెచ్చరించారు కౌశిక్ రెడ్డి గత చరిత్ర అంతా అత్యంత నీచపు చరిత్ర ఈరోజు పెద్దోళ్ల మీద మాట్లాడి పెద్ద గొంతు వేసుకొని మాట్లాడితే నేను పెద్దోడిని అయిపోతాననే ఊహలో తేలి ఆడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నీ నోరు, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకొని నువ్వు ఒక మనిషివని గుర్తుంచుకొని నువ్వు అన్నం తిన్నట్టుమాట్లాడమని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు
తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ పెద్దపీట వేసి ఉద్యమకారులను అవహేళన చేసి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే హుజురాబాద్ లో రౌడీయిజంతో, బెదిరింపులతో అధికార దుర్వినియోగం చేసి అక్రమ వసూళ్లకు పాల్పడి కేటీఆర్ బర్త్డేలకు టిఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు బ్లాక్మెయిలింగ్ తో వసూలు చేసినటువంటి నీచపు చరిత్ర కౌశిక్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు, అధికారులు అంటే గౌరవం లేదు, హుజరాబాద్ ప్రజలంటే గౌరవం లేదు, అందరి మీద ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవడం నోటికి వచ్చింది మాట్లాడడం వార్తలకు ఎక్కడం రాక్షసానందం పొందడం కౌశిక్ రెడ్డికి వెన్నతొ పెట్టిన విద్యా ని ఈ రకంగా ఇష్టారాజ్యంగా వాస్తవ దూరమైనటువంటి మాటలు
ప్రభుత్వం మీద గాని, ముఖ్యమంత్రి మీద గాని, మాట్లాడితే తగిన గుణపాఠం చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సైనికులు సిద్ధంగా ఉన్నారని భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్ది కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కటి సంజీవరెడ్డి, అన్నం ప్రవీణ్, కనుమల్ల రామకృష్ణ,కనుమల్ల సంపత్, పెద్ది శివకుమార్ , బుర్ర రమేష్ ,కారింగుల రాజేందర్, గైకోటి రాజు, మ్యాడద తిరుపతిరెడ్డి, బోగం సాయి, గురుకుంట్ల స్వామి, గూడెపు ఓదెలు, మీసా రాజయ్య, జిల్లెల్ల సందీప్ రెడ్డి, కుమారస్వామి, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, భోగం చిరంజీవి, మారపెల్లి వేణు, మారపల్లి వంశీ, పుట్ట రాజు, ఆకినపల్లి వెంకటేష్, రావుల రాజబాబు, పైడిపల్లి వెంకటేష్, రామకృష్ణ, గణేష్, బిజిగిరి శ్రీకాంత్, బండి పవన్ తదితరులు పాల్గొన్నారు.