సూటి ప్రశ్న!!

 

 

!IMG 20240811 WA19171

అధికారులకు, రాజకీయ నాయకులకు మన్యం గాయకుడు దుడ్డు సత్యనారాయణ సూటి ప్రశ్న.

అల్లూరి సీతారామరాజు జిల్లానుండి వివరాల్లోకి వెళితే??

(ఇంక్లూడింగ్ పి .ఓ & కలెక్టర్ ). మొన్న మీరు ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఎంత ఉత్సాహం తో పాల్గున్నారో, అదే ఉత్సాహం తో మా ఆదివాసీల సమస్యల పై మేము చేసే ఉద్యమాల్లో కూడా ఇలాగే పాల్గొని, మాకు సహకరించే దమ్ము మీలో వుందా? లేనప్పుడు మా ఆదివాసీల పండగలకు అటెండ్ అయ్యే అర్హత కూడా మీకు లేదు. మా సంతోషాలు కాదు, బాధల్ని కూడా పంచుకోండి. అప్పుడే, ఒక నిజమైన నాయకుడిగా, నిజమైన అధికారిగా మన్యం ప్రజలు నమ్ముతారు.మా కష్టాలు చెప్పుకోవడానికి రోడ్డెక్కితే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ లు చేసి మానసికంగా బాధపెడుతున్నారు. ఆదివాసీ దినోత్సవం అంటే ఆదివాసీలు ఆనందంగా జరుపుకునే ఓ గొప్ప పండగ, కానీ మా ఆయువు పట్టులాంటి            జి  ఓనం   3 లాంటి చట్టాల విషయం లో ఉద్యమాలు చేస్తుంటే, వచ్చి సహకరించాల్సిన మీరు, చూసీ చూడనట్టు ఉండిపోయే మీకు మా ఆదివాసీ ల వేడుకలకు పాల్గునే అర్హత లేదు. కాబట్టీ ఇప్పటికైనా మేము ప్రభుత్వాల పక్షం కాము, మన్యం ప్రజల పక్షం అని నిరూపించుకోండి,అప్పుడే మన్యం ప్రజలు నమ్ముతారు,లేదంటే నిన్న మీరు వేదికలపై కూసిన కూతలకు అర్దమే ఉండదు.

Join WhatsApp

Join Now