Headlines in Telugu:
-
“తంగళ్లపల్లి: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కఠిన చర్యలు, మద్యం స్వాధీనం”
-
“తంగళ్లపల్లి ఎస్ఐ బి. రామ్మోహన్ చేసిన దాడుల్లో 12 వేల విలువ గల మద్యం స్వాధీనం”
-
“తంగళ్లపల్లిలో అక్రమ మద్యం విక్రయంపై ఎస్ఐ బి. రామ్మోహన్ కఠిన చర్యలు”
-
“తంగళ్లపల్లి గ్రామాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కఠిన చర్యలు, 12 వేల రూపాయల మద్యం స్వాధీనం”
-
“తంగళ్లపల్లి: మద్యం విక్రయులకు ఎదురైన కఠిన చర్యలు, నేరస్థుల అరెస్ట్”
*తంగళ్ళపల్లి ఎస్ఐ బి రామ్మోహన్*
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు రూ. 12 వేల విలువగల మద్యం స్వాధీనం చేసుకున్నారు. శనివారం తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని దాబాలు, హోటళ్లలో చట్ట వ్యతిరేకంగా సిట్టింగులు పెట్టి మద్యం అమ్ముతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై దాడులు నిర్వహించారు. సారంపల్లి గ్రామంలో అంబటి రాములు, నేరెళ్ల గ్రామంలో చంద్రగిరి అనిల్, ఓబులాపూర్ గ్రామంలో నందగిరి దేవయ్యలను అదుపులోకి తీసుకొని వారి వద్ద సుమారు 12 వేల రూపాయల విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్ళపల్లి ఎస్సై బి.రామ్మోహన్ తెలిపారు. మండలంలో ఇలాంటి దాబాలు, హోటళ్లల్లో అక్రమంగా సిట్టింగ్లు పెట్టి మద్యం విక్రయించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శ్రీకాంత్, నరేందర్, రాంప్రసాద్ ఉన్నారు.