అనధికార వైద్యులపై కఠిన చర్యలు – అల్వాల్‌లో రెండు కేంద్రాలు సీజ్

**అనధికార వైద్యులపై కఠిన చర్యలు – అల్వాల్‌లో రెండు కేంద్రాలు సీజ్**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కృష్ణ ఆయుధం మే 9

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అనధికార వైద్యులపై కొనసాగుతున్న చర్యలలో భాగంగా, కీసర డివిజన్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సత్యవతి మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ గీత ఆధ్వర్యంలోని అధికారుల బృందం ఈరోజు అల్వాల్ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.

ఈ తనిఖీల్లో, ఎలాంటి వైద్య అర్హతలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అలోపతి వైద్యం నిర్వహిస్తున్నట్లు గుర్తించిన గౌరవి పాలీ క్లినిక్ మరియు భువన డయాగ్నోస్టిక్స్‌లను అధికారులు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ, “ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టి అక్రమ వైద్య సేవలు అందిస్తున్న వారిపై మేము కఠిన చర్యలు తీసుకుంటాం. అర్హత లేని వ్యక్తులు నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, క్లినిక్స్‌లను గుర్తించి సీజ్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది” అని తెలిపారు.మెడికల్ కౌన్సిల్ గైడ్‌లైన్స్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment