*టీచర్లు క్లాస్ రూమ్ లోకి ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు: విద్యాశాఖ
* *Sep 19, 2024
*టీచర్లు తరగది గదిలోకి ఫోన్లు తీసుకెళ్లొద్దని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. సెల్ ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు ఫోన్ లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే హెచ్ఎం అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.