పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పి ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 31:
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడినందుకు గాను ఇప్పటికే 24 మందిపై కేసులు నమోదు గత మూడు రోజులలో 2,04,620/- రూపాయాల నగదు,17 మొబైల్స్ స్వాధీనం జిల్లా ఎస్పి శ్రీమతి సింధు శర్మ ఐపిఎస్ వెల్లడించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ పోలీస్ స్టేషన్ల పరిదిలో పేకాట ఆడినందుకు గాను పలువురు పై కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో ఇళ్ళల్లో బహిరంగ ప్రదేశంలో పేకాట, జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే కామారెడ్డి టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712686109, 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డైల్ లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పి ..
by kana bai
Published On: October 31, 2024 4:12 pm