కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
తేదీ: 03/02/2025
కొమరం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపిఎస్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ ఐపీఎస్ వాంకిడి మండలంలోని సరిహద్దు గ్రామాల్లో పశువుల అక్రమ అడ్డాలపై మఫ్టీలో వచ్చి మెరుపు దాడులు చేశారు.
వాంకిడి సరిహద్దులోని గోయగాం, చిచ్ పల్లి గ్రామ శివారులో 100 పైగా పశువులు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఏఎస్పీ సివిల్ డ్రస్ లో వచ్చి అక్రమ అడ్డాలపై దాడులు చేశారు.
అప్పటికే ఏఎస్పీ వస్తున్నట్టు సమాచారం అందుకున్న అక్రమార్కులు కట్టి ఉంచిన పశువులను సమీపంలోని పంటపొలాల్లో వదిలేశారు.
అయినా సిబ్బంది తో కలిసి ఏఎస్పీ మూడు చోట్ల దాడి చేసి సుమారు 100 వరకు పశువులను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన పశువులకు స్థానిక పశువైద్య సిబ్బందితో వైద్యం చేయించారు. అలాగే పలువురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మూగజీవాలను వాహనాల్లో తరలిస్తే, అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.