ఆటోలలో ప్రయాణికుల భద్రతకు కఠిన చర్యలు
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్ 23
మంగళవారం:
రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు ప్రణాళికలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ఆటో రిక్షాల ద్వారా ప్రయాణించే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రవాణా, ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. ఆటోలలో పెద్దలు ముగ్గురికి మించి, పిల్లలు ఆరుగురికి మించి ప్రయాణించరాదని స్పష్టం చేశారు. వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యేలా చూడాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల రాకపోకలను తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని కోరారు.