ఎల్లారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

  • 11 మందికి జైలు, 22 మందికి జరిమానా

ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 20, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి పట్టణంలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు పట్టుకొని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా, మొత్తం 33 కేసులపై విచారణ జరిగింది.

విచారణ అనంతరం 11 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మరో 22 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి.

ప్రశ్న ఆయుధం: రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్న వేళ… కఠిన శిక్షలే ఈ సమస్యకు సరైన పరిష్కారమా?

Join WhatsApp

Join Now