పుట్ పాత్ ఆక్రమణలపై కఠిన చర్యలు

– ఫుట్‌పాత్ వ్యాపారులు ఎలాంటి మినహాయింపులు లేకుండా ఖాళీ చేయాలి
– – ట్రాఫిక్ శాఖ హెచ్చరిక

నిజామాబాద్, సెప్టెంబర్ 24 ( ప్రశ్న ఆయుధం)
తిలక్ గార్డెన్ మున్సిపల్ కాంప్లెక్స్ పరిధిలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేస్తోన్న వారిపై ట్రాఫిక్ శాఖ గట్టి చర్యలు ప్రారంభించింది. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన దిశ కమిటీ సమావేశంలో ఫుట్‌పాత్‌ వ్యాపారాలపై సభ్యులు అధికారులను నిలదీయగా, అధికారులు వెంటనే స్పందించారు.

దీనికి అనుగుణంగా బుధవారం ట్రాఫిక్ పోలీసుల అద్వర్యంలో తిలక్ గార్డెన్ పరిధిలో గల గ్లామర్ హోటల్, శక్తి కూల్ డ్రింక్స్‌తో పాటు పుట్‌పాత్‌లపై పెట్టిన ఫ్లెక్సీలు, వ్యాపార ఏర్పాట్లను తొలగించారు.

పాదచారులకు ఇబ్బందులు కలిగించే ఫుట్‌పాత్ వ్యాపారాలను ఉపేక్షించమని స్పష్టం చేసిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇకపై ఈ తరహా అక్రమాలకు తావు లేదన్నారు. ఆక్రమణలను కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అయితే గ్లామర్ హోటల్ వద్ద పుట్‌పాత్‌పై ఉన్న జనరేటర్ మాత్రం తొలగించకపోవడం గమనార్హం. ఈ కార్యాచరణలో ట్రాఫిక్ పోలీసులు సక్రియంగా పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now