*మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు – కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరిక*
*కరీంనగర్ జూలై 21 ప్రశ్న ఆయుధం*
నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో నార్కోటిక్ సెల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.నార్కోటిక్ జాగిలం ” రాంబో ” తో జిల్లా కేంద్రంలో తనిఖీలను ముమ్మరం చేసినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా, కమిషనరేట్ పరిధిలో నిషేధిత గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి జమ్మికుంట పట్టణ ఠాణా పోలీసులు సోమవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్టాండ్, పార్సిల్ కార్యాలయాలు, కిరాణా షాపులు, పాన్ షాపులు వంటి ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు నార్కోటిక్స్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలం, డాగ్ హ్యాండ్లర్ కానిస్టేబుల్ కపిల్ కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు ప్రజలు బాధ్యతా యుతంగా వ్యవహరించి, ఎవరైనా వ్యక్తుల వద్ద ప్రభుత్వం నిషేధించిన గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఉన్నా, వాటిని విక్రయిస్తున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100కు డయల్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కమిషనర్ గౌస్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.