అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: ఎసై సృజన్ కుమార్..

*అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు: ఎసై సృజన్ కుమార్..*

*జనగామ జిల్లా:*

*దేవరుప్పుల మండల పరిధిలోని వాగు నుండి ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దేవరుప్పుల మండల ఎస్సై ఊర సృజన్ కుమార్ హెచ్చరించారు.* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు దేవరుప్పుల మండలంలోని వాగు పరివాహక ప్రాంతం నుండి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడకుండా దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలోని వాగు నుండి ఇసుక రవాణా జరుగకుండా ట్రాక్టర్లు వాగులోకి దిగకుండా ర్యాంపుల వద్ద కందకం తీసిన ఎస్సై ఊర సృజన్ కుమార్. వారి వెంట పొలీస్ సిబ్బంది యాకేశ్, తదితరులున్నారు.

Join WhatsApp

Join Now