పిసిపిఎన్‌డీటీ చట్ట అమలుపై కఠిన పర్యవేక్షణ

పిసిపిఎన్‌డీటీ చట్ట అమలుపై కఠిన పర్యవేక్షణ

నిబంధనలు ఉల్లంఘిస్తే స్కానింగ్ సెంటర్లపై చర్యలు : డీఎంహెచ్ఓ డాక్టర్ విద్య

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 23:

జిల్లా స్థాయి అడ్వైజరీ పిసిపిఎన్‌డీటీ సమావేశం మంగళవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోని డీఎంహెచ్ఓ ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ డాక్టర్ విద్య మాట్లాడుతూ ప్రతి నెల స్కానింగ్ సెంటర్లను పీవో, డిప్యూటీ డీఎంహెచ్ఓలు తప్పనిసరిగా తనిఖీ చేసి ఫామ్–ఎఫ్‌లు, రిజిస్టర్లను వెరిఫై చేయాలని ఆదేశించారు. పిసిపిఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేసి, అవసరమైతే సెంటర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. భేటీ బచావో–బేటీ పడావోపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో వైద్యులు, ఐఎంఏ ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment