Site icon PRASHNA AYUDHAM

పోడు భూములపై గిరిజనులకు హక్కు సాధనకై పోరాటం 

Screenshot 20251026 211559 1

పోడు భూములపై గిరిజనులకు హక్కు సాధనకై పోరాటం

 

కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 26

 

జిల్లాలోని రాజంపేట మండలం పీజీ తాండాలో గిరిజన రైతులతో కలిసి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పోడు భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ, 2004కు ముందు నుంచే తమ తాతలు వారసత్వంగా సాగుచేసుకుంటూ జీవనం కొనసాగించిన భూములను గిరిజనుల నుంచి లాక్కొని, వారి మీద అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు.

 

గిరిజనులు అడవిని నరికి వన్యప్రాణులను ఇబ్బంది పెట్టారని తప్పుడు ఆరోపణలతో 20 మందిపై కేసులు పెట్టి, ఫారెస్ట్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల్లో తుమ్మలపల్లి మైసమ్మ గుడి, సీట్ల గుడి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, గిరిజనులకు దేవుని దర్శనం కూడా నిరాకరించడం దారుణమన్నారు.

 

అటవీ హక్కుల చట్టం ప్రకారం వెంటనే గిరిజనులకు హక్కు పత్రాలు జారీ చేయాలని, ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు పండ్ల తోటల ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందిగా డిమాండ్ చేశారు.

 

ఎన్నికల ముందు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. జోగ్రాం గుట్ట, పీజీ తాండా ప్రాంతాల్లో అరాచకంగా వ్యవహరిస్తున్న బాబా అనే ఫారెస్ట్ అధికారిని వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో బానోత్ రవి, కేలోత్ రవి, అంబర్ సింగ్, ప్రేమ్ సింగ్, బి.చందర్, జగిత్యా రాజు, రవి భాస్కర్, బుజ్జి, మౌనిక, మనకి సుంద, పురాలి శోభ, లక్ష్మీ మీరి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version