హక్కుల కోసం పోరాటం

జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతర పోరాటం టీ జే యు తోనే సాధ్యం:

… బింగి స్వామి టీ జే యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రశ్న ఆయుధం 23జులై
సంగారెడ్డి :
జర్నలిస్టుల హక్కుల కోసం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి అన్నారు.
సంగారెడ్డి జిల్లాలో అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతగానో పోరాటం చేసిన జర్నలిస్టులకు కేసిఆర్ ద్రోహం చేశాడని, రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉందన్నారు. కెసిఆర్ ఎన్ని అక్రమ కేసులు పెట్టిన జర్నలిస్టులు బెదరకుండా నిజాలు బయటకు తీసి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాటం చేశారని, రేవంత్ రెడ్డికి మద్దతుగా అనేక వార్త కథనాలు రాసిన జర్నలిస్టుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టొద్దన్నారు.
జర్నలిస్టులకు అక్రిడేషన్, పక్క ఇండ్లు ,హెల్త్ జర్నలిస్ట్ పిల్లలకు ఫ్రీ నాణ్యమైన ఎడ్యుకేషన్ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు వల్లపు శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్, మెదక్ జిల్లా అధ్యక్షులు పి, రామయ్య లు పాల్గొని, తమ తమ జిల్లాలలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తున్నామన్నారు.

Join WhatsApp

Join Now