హాస్టల్ భవనం పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం..

*హాస్టల్ భవనం పై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్యాయత్నం..*

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని బాలుర వసతి గృహం పై అంతస్తు నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన చందు అనే విద్యార్థి ఈరోజు మధ్యాహ్నం బిల్డింగ్ పైనుంచి అకస్మాత్తుగా కిందికి దూకాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం ఎందుకు చేశాడనేది ఇప్పటివరకు తెలియ రాలేదు..

Join WhatsApp

Join Now