కంటేశ్వర్ లో తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య..

నిజామాబాద్ కంటేశ్వర్ లో తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య..

నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 05

హాస్టల్ కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే నగరంలోని కంటేశ్వర్ లోని లక్షిత(16) హాస్టల్ కి వెళ్ళమని తల్లిదండ్రులు చెప్పారు అందుకు విద్యార్థిని వెళ్లనని నిరాకరించినట్లు తెలుస్తోంది.దీంతో తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now