కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి సేన నూతన కమిటీ ఏర్పాటు..
విద్యార్ధి సేన జిల్లా అధ్యక్షులు
కామారెడ్డి జిల్లా ఇంఛార్జి
(ప్రశ్న ఆయుధం)జులై 29
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం విద్యార్థి సేన కళాశాల నూతన కమిటీని నియమించినట్లు విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు కొత్మీర్కర్ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ విద్యార్థి సేన ఎల్లప్పుడూ సమాజ సేవలో ముందుంటుందన్నారు. నూతన కమిటీ ఏర్పాటులో భాగంగా అధ్యక్షునిగా ప్రణీత్ కుమార్, ఉపాధ్యక్షునిగా పవన్ తేజ, ప్రధాన కార్యదర్శిగా ఆత్మరత్, సహాయ కార్యదర్శిగా కూతుబ్ ఉద్దిన్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.