*విజ్ఞాన్ స్కూల్ లో ఘనంగా విద్యార్థుల వీడుకోలు*
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో ఆదివారం రోజున ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు వీడుకోలు సమావేశం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి పాఠశాలకు హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య హాజరయ్యారు సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ జీవితంలో కష్టపడి చదివినప్పుడే ఉన్నత స్థాయికి వెళతామని, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలని ఉన్నత స్థాయిలో చూడాలని చాలా కష్టపడి చదివిపిస్తున్నారని, వాళ్ళ కష్టానికి మీ మార్కులతో బదులు ఇవ్వాలని, తనకు ఈ క్యాంపస్ కు అవినాభావ సంబంధం ఉందని, తాను కూడా ఇదివరకు ఈ క్యాంపస్ లో టీచర్ గా పని చేశానని తెలిపారు. తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ పదవ తరగతి పిల్లలను ప్రణాళిక ప్రకారం చదివిపిస్తున్నామని, విద్యార్థులలో భయాన్ని పోగొట్టడం కోసం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సందేహాన్ని నివృత్తి చేస్తూ చదివిస్తున్నామని, ఈసారి మంచి మార్కులతో విజయకేతనం ఎగుర వేస్తామని, అలాగే పదవ తరగతి రాస్తున్న పిల్లలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపల్ కొండబత్తిని శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.