జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థుల ప్రతిభా పోటీలు

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు చిత్రలేఖనం, పోస్టర్ తయారీ, గ్రంథాలయ స్లోగన్ల రచన వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి సి. వసుంధర సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించేలా చురుకుగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ, విద్యార్థుల నైపుణ్యాన్ని మాధ్యమాల వారీగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. పోటీల్లో బాలబాలికలు చూపిన ప్రతిభ ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు. విజేతలకు వారోత్సవాల ముగింపు రోజున బహుమతులు ప్రదానం చేయనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ముగ్గుల పోటీ, మెహంది వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు గ్రంథాలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ యస్. వంశీకృష్ణ, ఉపాధ్యాయులు, గ్రంథాలయ పాఠకులు, విద్యార్థులు, పాఠకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now