జేఎన్టీయూ హెచ్ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌పై విద్యార్థి సంఘాల ఆందోళన

జేఎన్టీయూ హెచ్ పీహెచ్‌డీ నోటిఫికేషన్‌పై విద్యార్థి సంఘాల ఆందోళన

నోటిఫికేషన్ విడుదలను జూలైకి వాయిదా వేయాలని డిమాండ్

బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధరావత్ వినోద్ నాయక్

ప్రశ్న ఆయుధం మే18: కూకట్‌పల్లి ప్రతినిధి

జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ హెచ్)లో ఈ నెల 21న విడుదల కానున్న పీహెచ్‌డీ నోటిఫికేషన్‌పై విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎంటెక్ చివరి సంవత్సరం విద్యార్థులు తుదిదశ ప్రాజెక్టుల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని, ఇలాంటి సమయంలో అకడమిక్ రెగ్యులేషన్ లేకుండానే నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షుడు ధరావత్ వినోద్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై జేఎన్టీయూ హెచ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ డాక్టర్ బాలు నాయక్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు వినోద్ నాయక్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నోటిఫికేషన్‌ను జూలై నెల లేదా కోర్సులు పూర్తయిన అనంతరం విడుదల చేస్తే, ఎంతోమందికి లాభకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అకడమిక్ సంవత్సరం నడుమ విడుదలైన నోటిఫికేషన్ కారణంగా విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now