ఈనెల 30 తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే బహిరంగ సభని జయప్రదం చేయండి.
పి.డి.ఎస్.యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ,భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్
పి.డి.ఎస్.యు.50 వసంతాల స్వర్ణోత్సవాల ను పురస్కరించుకొని చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది.
భారత విద్యార్థి ఉద్యమాలకు పి.డి.ఎస్.యు. దిక్సూచిలా
నిలిచిందని, 50 ఏళ్ల లో విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం, శాస్త్రీయ విద్య సాధన ,సమసమాజ స్థాపనే ద్యేయంగా పి డి ఎస్ యు పోరాడిందని పి.డి.ఎస్.యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ,భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ తెలిపారు.
సోమవారం చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పి.డి.ఎస్.యు. 50 వసంతాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని పోస్టర్ ఆవిష్కరణ సదస్సు నిర్వహించటం జరిగింది.
సందర్భంగా కాంపాటి పృథ్వీ,మునిగేలా శివ ప్రశాంత్ మాట్లాడుతూ నక్సల్భరి, శ్రీకాకుళం,గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల ప్రేరణతో, కత్తుల వంతెన పై నెత్తుటి కవాతు చేసిన పి.డి. ఎస్.యు. 50 యేండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎందరో విద్యార్థి రత్నాలైన జార్జిరెడ్డి,జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,శ్రీపాద శ్రీహరి,కోలాశంకర్,రంగవల్లి, చేరాలు,రమణయ్య, సాంబయ్యలు తమ వేడి నెత్తురు ను ధార పోశారని గుర్తు చేశారు.
పి డి యస్ యూ ఆవిర్భావం నాటినుండి అధిక ధరలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా, ఆశ్రిత పక్షపాతం అవినీతికి వ్యతిరేకంగా, కుల వివక్షత, మతోన్మాదానికి వ్యతిరేకంగా, మహిళలపై దాడులు, సంక్షేమ హాస్టల్స్ సమస్యలపై, పెండింగ్ స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ కై, యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేపట్టిందని వారు తెలిపారు.
ఈ క్రమంలో 50 ఏళ్ల తర్వాత కూడా భవిష్యత్ తరాలకు మరింత ఉత్తేజాన్ని కలిగిస్తూ పి.డి. ఎస్.యు. పోరాటాలను కొనసాగిస్తుందని తెలిపారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సంఘటితంగా ఉద్యమించాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి డి ఎస్ర యు మేష్, సురేష్, నరేందర్, రాంబాబు, రాంప్రసాద్ ప్రవళిక, శ్రీలత,సంమ్రీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పి డి ఎస్భ యు ద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ 9849599748