టీచర్లను నియమించాలంటూ రోడ్డు ఎక్కిన విద్యార్థులు

ఆసిఫాబాద్ జిల్లా: సెప్టెంబర్ 19

టీచర్లు కావాలని ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఈరోజు రోడ్డెక్కి నిరసన తెలిపారు.

ఆసిఫాబాద్ ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, ఇద్దరు ఉపాధ్యా యులు మాత్రమే వచ్చారని విద్యార్థులు ఆరోపించారు.

తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలో టీచర్లను నియమించాలని విద్యార్థులుకోరుతున్నారు.

Join WhatsApp

Join Now