Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులకు సృజనాత్మక విద్య అవసరం ఎంఈఓ ఎల్లయ్య.

IMG 20250805 WA0102 1

_విద్యార్థులకు సృజనాత్మక విద్య అవసరం

_ ఎంఈఓ ఎల్లయ్య

 

_కామారెడ్డి, ఆగస్టు 5: (ప్రశ్న ఆయుధం)

విద్యార్థులు సృజనాత్మకంగా ఎదగాలంటే చదువు  అభిరుచుల పెంపు అవసరమని కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య అన్నారు.మంగళవారం లింగాయపల్లి గ్రామంలోని  పాఠశాల ప్రార్థన సమయానికి హాజరైమాట్లాడారు.ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ మ్యాథ మెటిక్స్, ఇంగ్లీష్, తెలుగు తదితర సబ్జెక్టులపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని సూచించారు.విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపునకు  ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.ఈకార్యక్రమంలోపాఠశాలప్రధానోపాధ్యాయులు గోపాలరావు, ఉపాధ్యాయులు కృష్ణారావు, స్రవంతి, రాజయ్య, సీఆర్‌పి చిరంజీవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version