మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు
*గ్రామీణ వ్యవసాయం పై అవగాహన*
జహీరాబాద్ నియోజకవర్గం లోని లచ్ఛ నాయక్ తాండ గ్రామం లో డి.డి.ఎస్ కె.వి.కె ఆధ్వర్యం లో శిక్షణలు మల్లా రెడ్డి యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ చదివే విద్యార్థులు లచ్చ నాయక్ తాండ గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్న రైతులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పండే పంటల సాగు విధానాలపై విద్యార్థులు సమగ్ర పరిశోధన చేశారు.
విద్యార్థులు గ్రామం గురించిన వివరాలను తెలుసుకోవడానికి మరియు గ్రామంలోని సమస్యలను విశ్లేషించడానికి వ్యవసాయ కార్యకలాపాలను తెలుసుకోవడానికి కేంద్రీకృత బృంద చర్చలు నిర్వహించారు. విద్యార్థులు గ్రామంలో పి.ఆర్.ఏ( భాగస్వామ్య గ్రామీణ అంచనా) కార్యక్రమం నిర్వహించారు. పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ (PRA) అనేది లొకేషన్ నిర్దిష్ట సమస్యలను మరియు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం సాధ్యమైన పరిష్కారాలను రూపొందించడానికి పరిశోధన చేయదగిన సమస్యలను గుర్తించడానికి ఒక ముఖ్యమైన సాధనం. ఉపయోగించిన పి ఆర్ ఏ సాధనాల్లో ట్రాన్‌సెక్ట్ వాక్, సోషల్ మ్యాపింగ్, టైమ్ ట్రెండ్, కాలానుగుణ విశ్లేషణ, టైమ్‌లైన్ మొదలైనవి ఉన్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డా. ప్రియాంక, డా. రమేష్ కలిసి గ్రామీణ వ్యవసాయ స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు రమేష్ వైజానాద్ సుభాష్ పాండు చవాన్ విద్యార్థినిలు. తన్మయి సృజన శ్రీనిజ తేజస్విని రక్షిత శ్రీనిధి.