బిబిపేట్ మండలం లో మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్ బిల్డింగ్ మార్చలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్..
కామారెడ్డి జిల్లా బీబీపెట్
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 21:
బిబిపేట్ మండల కేంద్రంలో గల మహాత్మ జ్యోతిబా రావు పూలే బాలుర హాస్టల్ తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులు ఆర్ రమేష్ మాట్లాడుతూ. ఇలా అన్నారు.
ఎం జె పి హాస్టల్లో కనీస వసతులు లేవని, కనీస వసతులు కల్పించాలని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంటూ తల్లిదండ్రులు ఒక కమిటీగా ఏర్పడి వినతి పత్రాలు, రాస్తారోకోలు, ధర్నాలు, చేయడం జరిగింది, కానీ ఎక్కడ చర్యలు కనబడటం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి, గత నెలలో తేదిన 18/23/9/24 23/9/24 తేదీలలో రెండుసార్లు వినతిపత్రం ఇచ్చారు.కానీ నామమాత్రం గానే హాస్టల్లో సందర్శించివెళ్లారు, కానీ చర్యలు లేవు ప్రధానంగా గురుకులాల ఇంచార్జ్ ఆర్ సి ఓ సత్యనంద రెడ్డి ప్రైవేట్ బిల్డింగ్ ఓనర్ తో కుమ్మక్కై నెలనెలా కమిషన్లు తీసుకుంటూ మా పిల్లల భవిష్యత్తుతో, ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని అన్నారు,
ఇప్పటికె బిల్డింగ్ సరిపోతా లేదు, బాత్రూంలో లేవు, స్నానాల గదులు లేవు, పండుకోవడానికి బిట్స్ లేవు, చదువుకోవడానికి క్లాస్ రూములు లేవు, ఆడుకోడానికి ఆటస్థలం,డైనింగ్ హాల్స్ లేవు,
కానీ ఇన్ని సౌకర్యాలు లేని బిల్డింగ్లో కొనసాగించే విధంగా ఆర్ సి ఓ గ
సుముఖంగా ఉన్నారు. అంటే దీని అర్థం కమీషన్ల తీసుకుంటున్నారని అ అని అన్నారు.ఆర్ సి ఓ కుటుంబం ఒకటి బాగుంటే సరిపోతుందా మిగతా 400 కుటుంబాలు బాగా లేకపోయినా పర్వాలేదా అనే విధంగా ఆయన విధులు నిర్వహిస్తున్నారని అన్నారు,దసరా సెలవులు ముగిసే లోపు ప్రత్యామ్నాయం చెయ్యకపోతే కచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆమరణ దీక్షకు దిగుతాం అంటూ హెచ్చరించారు,
అంతేకాదు మా పిల్లల భవిష్యత్తు కోసం, నేటి బాలలే రేపటి పౌరుల నినాదానికి అనుగుణంగా విద్యార్థి సంఘాలతో, ప్రజా సంఘాలతో, రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజు, దేవరాజు, మొగులయ్య, రాములు, సాయిలు,శ్రీను,దిలీప్,స్వామి,దేవరాజ్, సాయిలు, పాల్,కరుణా, లావణ్య, రోజా, సోనీ,రేఖ, పద్మ, సుజాత,తదితరులు పాల్గొన్నారు.