Site icon PRASHNA AYUDHAM

చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి

*విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి*

*ఎక్సైజ్ ఎస్సై సౌమ్య*

*జమ్మికుంట నవంబర్ 16 ప్రశ్న ఆయుధం*

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని జమ్మికుంట ఎక్సైజ్ ఎస్సై సౌమ్య అన్నారు జమ్మికుంట పట్టణంలోని చాణక్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో జమ్మికుంట ఎక్సైజ్ ఎస్సై సౌమ్య పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలు వాడటం వల్ల పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దబ్బేట విజయ-రవీందర్ డైరెక్టర్లు బండి ప్రభాకర్ శ్రీనివాస్ విజేందర్ రెడ్డి చిరంజీవి శివ కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు సాయికృష్ణ సతీష్ అగ్నిమాపక సిబ్బంది అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version