Site icon PRASHNA AYUDHAM

విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల జరిగే నష్టం పట్ల అవగాహన కల్పించాలి : అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు.గురువారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాస్థాయి యాంటీ డ్రగ్ కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలు అలవాటు ఉన్న వారిని గుర్తించి వారిని పునరావాస కేంద్రాల ద్వారా అలవాటు మాన్పించాలన్నారు. కళాశాలో మరియు నిర్వహించే పేరెంట్స్ టీచర్ సమావేశాలలో డ్రగ్స్, గంజాయి వినియోగం వలన కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్యాల రవాణా, సాగు మరియు వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.
ఒత్తిడికి గురయ్యే విద్యార్థులలో ఆత్మ స్థాయిర్యాన్ని నింపేందుకు భయాన్ని పోగొట్టేందుకు మరియు ఇతర మానసిక ఒత్తిడిలకు గురి అయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా14416 టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టెలి మానస్ కు కాల్ చేస్తే నిపుణులైన మానసిక వైద్యులు ఉచిత కౌన్సెలింగ్ సేవలు అందిస్తారని చెప్పారు.
ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, ఏ ఆర్ డి.ఎస్.పి సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి మరియు స్ట్రెస్ మేనేజ్మెంట్ అధికారి ఆదిశేషు, అన్ని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్స్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version