విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందించాలి
సిద్దిపేట పట్టణ కమిటి పాదయాత్ర
సిద్దిపేట డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం :
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టి నాణ్యమైన విద్యను అందించాలని హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అధ్యయన యాత్రలో భాగంగా వ పాదయాత్ర చేపట్టడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ పాదయాత్ర ముగింపు సందర్భం గా మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ కార్యదర్శి బత్తుల అభిషేక్ భాను తో కూడిన 9 మంది నాయకులతో పాదయాత్ర చేపట్టారని గురువారం సిద్దిపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పాదయాత్ర రూపంలో వెళితే అనేకమంది విద్యార్థులు నాణ్యమైన భోజనం అందడం లేదని ఇండ్ల లోకి వెళ్లి భోజనం చేస్తున్నారని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు మిడ్ డే చార్జిలు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని వారు కోరారు.