విద్యార్థులు శ్రమదానం లో ముందుండాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ Dr. బీ.రమేష్
జమ్మికుంట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం
విద్యార్థులు శ్రమదానం లో ముందుండాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రమేష్ అన్నారు. శనివారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం ) ఆధ్వర్యంలో విద్యార్థులు వాలంటీర్లు, అధ్యాపకులు శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలను చెత్త, చెదారం తొలగించారు అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రమదానం వంటి కార్యక్రమాలలో పాల్గొనాలని వ్యక్తిత్వ వికాసం, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించు కోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ డా. గణేష్ అకడమిక్ కో-ఆర్డినేటర్ డా. కె. రాజేంద్రం, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ఎంబాడి రవి, లోఖండే రవీందర్, అధ్యాపకులు డా. శ్యామల. డా. మాధవి, ఉమాకిరణ్, శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, డా.సుమ్మ, డా. రవి ప్రకాష్, డా. శ్రీనివాస్ రెడ్డి, శివకృష్ణ, సాయి, ప్రశాంత్, విద్యార్థులు వలంటీర్లు తదితరులు పాల్గోన్నారు.