సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని, భారత దేశ హాకీ క్రీడా వజ్రం “”ధ్యాన్ చంద్” ను ఆదర్శంగా తీసుకొని మంచి క్రీడాకారులై దేశానికి మంచి పేరు తేవాలని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ మంగళపర్తి వెంకటేశం అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, భారత హాకీ క్రీడాకారుడైన ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా అతని పుట్టిన రోజైన ఆగష్టు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవంను భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు.
ఈ దినోత్సవంను పురస్కరించు కొని
లయన్స్ క్లబ్ ఆప్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో
ఎంపవర్ నిర్మాణ యూత్ ఎంపవర్మెంట్
వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్ లయన్ జులకంటి ప్రభాకర్ (దాత) సహకారంతో క్లబ్ అధ్యక్షుడు జార్జ్ మ్యాథ్యు అధ్యక్షతన ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాల సంగారెడ్డిలో
ఘనంగా క్రీడా దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు క్రీడా సామాగ్రి కోసం 10వేల రూపాయలను ప్రధానోపాధ్యాయులు షహనాథ్ బేగంకు ప్రభాకర్ చేతుల మీదుగా క్లబ్ అధ్యక్షుడు అందజేశారు. ఈ సందర్భంగా చెస్, క్యారమ్స్, రన్నింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్స్, మెమంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ నాయికోటి రామప్ప, లయన్ క్వెస్ట్ చైర్మన్ లాడే మల్లేశంలతో పాటు లయన్ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, భరతయ్య, కిరణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యాయ బృందం శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి, పద్మావతి, శివకుమార్, పీఈటీ నాగరాజు గౌడ్, సి.ఆర్.పి. లక్ష్మినారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.