విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై దృష్టి సారించాలి 

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పై దృష్టి సారించాలి

– విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకోవాలి

* టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు కోడం అజయ్

* మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు

సుల్తానాబాద్,డిసెంబర్-16  : విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు, టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కోడం అజయ్ అన్నారు. స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సోమవారం పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. జిల్లా లోని వివిధ పాఠశాలల నుంచి 100 మంది విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని,లక్ష్యం దిశగా ముందుకు సాగాలని, గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, రాష్ట్రస్థాయిలో విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.

IMG 20241216 WA0039

సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ పబ్లిక్ పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ టేబుల్ టెన్నిస్ జిల్లా కార్యదర్శి బొల్లి సత్యనారాయణ, అసోసియేషన్ కోశాధికారి గోపికృష్ణ, సహాయ కార్యదర్శి ఇక్బాల్, తిరుపతి,పీఈటీలు ఆసియా, మధు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now