*విద్యార్థులు క్యాష్ మేనేజమెంట్ విధానము అలవర్చుకోవాలి*
ప్రశ్న ఆయుధం, హైదరాబాద్ :
ది ఆదర్శ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ బోయినపల్లి శాఖ ఆధ్వర్యంలో సెయింట్ పీటర్స్ హైస్కూల్ విద్యార్థులకు కిడ్డి బ్యాంకు ద్వారా దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలియ జేసే ఉద్దేశ్యంతో బ్యాంకు శాఖ మేనేజర్ బ్రహ్మానందం, సహాయ మేనేజర్ వెంకటేశము సందర్శించారు. ఈ సందర్భంగా సహాయ మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే క్యాష్ మేనేజమెంట్ విధానము అలవర్చుకోవాలని అందులో భాగంగానే విద్యార్థులకు వారి బంధువులు, మిత్రులు పండుగకు, ఫంక్షన్స్ లకు ఇచ్చే డబ్బును వృధాగా ఖర్చు చేయకుండ బ్యాంకులో దాచుకోవాలని, అది పెద్ద మొత్తములో ఏర్పడి భవిష్యత్తులో తదుపరి విద్యా ఖర్చులకు
ఉపయోగపడుతుందని, క్యాష్ ను ఎలా ఖర్చు పెట్టాలి అనే అవగాహన చిన్ననాటి నుండే ఏర్పడుతుందని దాని వలన భవిష్యత్ జీవితము బంగారు బాట అవుతుందని తెలిపారు.
పాఠశాల ప్రిన్సిపాల్ బి.యన్. రెడ్డి మాట్లాడుతూ కిడ్డి సేవింగ్ బ్యాంకు విధి, విధానములు దాని యొక్క ప్రాముఖ్యతను చాల వివరంగా విద్యార్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమములో స్కూల్ టీచర్స్, ఆఫీస్ సిబ్బంది పాటు 400 మంది విద్యారులు పాల్గొన్నారు.