విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో రాణించాలి

*విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో రాణించాలి*

–ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మండలంలోని దాచారం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా చదివి భవిష్యత్తులో రాణించాలని అన్నారు. పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కెమ్మసారం రవీందర్ ను అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి తనవంతుగా 60 మంది విద్యార్థులకు క్రీడా దుస్తులు అందించారని, ప్రతి ఒక్కరు ఉద్యోగంతో పాటు సామాజిక సేవలో పాల్గొని స్ఫూర్తిగా నిలవాలని కోరారు. అంతకు ముందు తోటపల్లి గ్రామంలో 20లక్షల రూపాయలు నిధులతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఎంపీడీఓ కె ప్రవీణ్, ఎంఈఓ మహతి లక్ష్మి, మార్కెట్ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంపత్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, భైర సంతోష్, రంగోని రాజు గౌడ్, బొనగం రమేష్, సాధిక్, శంకర్, శ్రీనివాస్, పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, సిద్ధిరాములు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment