విద్యార్థులు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి…

విద్యార్థులు జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి…

-కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా

-బాలల దినోత్సవ సందర్భంగా పలు పాఠశాలలో విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ

ఎల్లారెడ్డి మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. మండలంలోని మల్లయ్యపల్లి, సబ్దల్ పూర్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదిశలమేరకు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడుతూ… భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేశారు. వివిధ జాతీయ నాయకుల జీవితాలను స్పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు సంతోష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నాగం శ్రీనివాస్, కంచం సిద్దు ,ప్రకాష్ ,మైపాల్ ,సాయిబాబా గౌడ్, నాగరాజ్ ,సత్యనారాయణ, సుధాకర్, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, ఉపాధ్యాయుల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now