విద్యార్థి సంఘాల మద్దతు బీసీ జేఏసీ బంద్‌కు —
అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని పిలుపు
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్
హైకోర్టు స్టేకు అగ్రవర్ణాల కుట్ర కారణమని ఆరోపణ
సామాజిక న్యాయానికి విద్యార్థి సంఘాల పూర్తి మద్దతు
జిల్లావ్యాప్తంగా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు
కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్
బాన్సువాడ ఆర్ సి ప్రశ్న ఆయుధం అక్టోబర్16
ప్రెస్‌మీట్‌లో PDSU జిల్లా అధ్యక్షులు ఎన్. బాల్ రాజ్, TNSF రాష్ట్ర నాయకులు పుట్ట భాస్కర్, TSP జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ “బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని జేఏసీ డిమాండ్ పూర్తిగా న్యాయమైనది. జనాభా శాతానికి తగిన వాటా ప్రతి వర్గానికీ రావాలి. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయం జరగాలి” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చినా, అగ్రవర్ణాల కుట్ర వల్ల హైకోర్టు స్టే వచ్చింది అని వారు మండిపడ్డారు.నోటి కాడి ముద్దను లాగేసుకున్నట్లు అగ్రవర్ణాలు బీసీల హక్కులు దోచుకుంటున్నాయి. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు వీధుల్లోకి దిగుతాయి” అని హెచ్చరించారు.జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు బంద్ విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈ సమావేశంలో ప్రకాశ్, శ్రీకాంత్, రాజు, సాయికుమార్, రాజేందర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
విప్లవభినందనలతో –
ఎన్. బాల్ రాజ్
PDSU (S) ఉమ్మడి నిజామాబాద్-కామారెడ్డి జిల్లా అధ్యక్షులు