Site icon PRASHNA AYUDHAM

దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ కొరకు సకాలంలో దరఖాస్తులు సమర్పించాలి*

IMG 20240821 WA0255

*దివ్యాంగ విద్యార్థులు జాతీయ స్కాలర్షిప్ కొరకు సకాలంలో దరఖాస్తులు సమర్పించాలి*

*జిల్లా సంక్షేమ అధికారి బావయ్య*

**ఆగస్టు 31 లోపు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు, అక్టోబర్ 31 లోపు పోస్ట్ మెట్రిక్, టాప్ క్లాస్ స్కాలర్షిప్ దరఖాస్తు సమర్పణకు గడువు*

ప్రశ్న ఆయుధం, ఆగస్టు 21, కామారెడ్డి :

జిల్లాలోని అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఉన్నత విద్య కొరకు జాతీయ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు సకాలంలో సమర్పించాలని జిల్లా సంక్షేమ అధికారి బావయ్య బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

మహిలలు, పిల్లలు, వికలాంగుల, వయో వృద్దుల సంక్షేమ శాఖ క్రింద దివ్యాంగుల సాధికారత విభాగం ద్వారా జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ నందు దివ్యాంగుల ఉన్నత విద్యకు మూడు రకాల స్కాలర్షిప్ లు అందించడం జరుగుతుందని, 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్, ఇంటర్ నుంచి పిజి వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లమా కోసం టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ అందిస్తామని అన్నారు.
కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ , టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ నూతన లేదా రెన్యువల్ దరఖాస్తులు www.scholorships.gov.in లేదా www.depwd.gov.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు తెలిపారు. దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులు తమ దరఖాస్తులు సమర్పించేందుకు ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ కోసం ఆగస్టు 31 ,2024 వరుకు, పోస్ట్ మెట్రిక్ , టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ కోసం అక్టోబర్ 31, 2024 వరకు గడువు ఉందని , ఇతర వివరాల కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం సమీకృత జిల్లా కలెక్టరేట్ రూమ్ నెంబర్ 31 నందు నేరుగా సంప్రదించాలని ఆయన కోరారు.

Exit mobile version