Headlines :
-
సమ సమాజ స్థాపనకు విద్యార్థి, యువకులు పోరాడాలి
-
జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, నీలం రామచంద్రయ్య స్మారక సభలో వక్తల పిలుపు
-
విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటానికి పిలుపు
జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,నీలం రామచంద్రయ్య ల స్మారక సభలో వక్తల పిలుపు
సమ సమాజ నిర్మాణం కొరకు ప్రగతిశీల విద్యార్థి యువకులు పోరాడాలని సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు,రాష్ట్ర నాయకులు జడ సీతారామయ్య,జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,పి డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు భోనగిరి మధు,రాష్ట్ర సహాయ కార్యదర్శి జి. మస్తాన్,పి వై ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ పిలుపునిచ్చారు. విద్యార్థి అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా
సోమవారం ఇల్లందులో అయితా ఫంక్షన్ హాల్లో పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరప రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన పి డి ఎస్ యు నిర్మాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్,విప్లవ ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య ల స్మారక సభలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాణంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కీలకపాత్ర పోషించారని అన్నారు.1972 ఏప్రిల్ 14న ఉస్మానియా క్యాంపస్లో జార్జిరెడ్డిని ఏబీవీపీ,ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు హత్య చేశారని అన్నారు.జార్జి ఆశయాల స్ఫూర్తితో బలమైన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి పునాది వేసిన జంపాల ప్రసాద్ ను తనతో పాటు విప్లవోపాధ్యాయుడు ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యను నాటి వెంగళరావు ప్రభుత్వం1975 నవంబర్ 5న ఇల్లెందు దగ్గర చీకటి గండ్లడవిలో చెట్లకు కొట్టేసి కాల్చి చంపారని అన్నారు.
అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడం అంటే తాము సాధించ తలపెట్టిన ఆశయాలు, ఆదర్శాలకు మరోసారి మనం పునరాంకితం కావడమేనని అన్నారు.పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లను,ఫీజు రీఎంబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, శాస్త్రీయ విద్య సాధన,సమసమాజ స్థాపనకై నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.సభ ప్రారంభంలో రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు సంతాపం తెలిపారు.
సభానంతరం మండల పరిధిలోని బొజ్జాయిగూడెం సమీపంలో చీకటి గండ్లడవిలో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో అమరులు కామ్రేడ్ జే సి ఎస్ ప్రసాదు,నీలం రామచంద్రయ్య ల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈసందర్భంగా పి డి ఎస్ యు బిగి పిడికిలి జెండాను అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు నాగన్న ఆవిష్కరించారు.
ముందుగా ఇల్లందు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి భారీ ప్రదర్శనగా గోవింద్ సెంటర్,కొత్త బస్టాండ్, బుగ్గవాగు బ్రిడ్జి మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈకార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఎం. రాజేంద్రప్రసాద్,ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కుసారంగపాణి,పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గం ప్రణయ్ కుమార్, పి వై ఎల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చింతా నరసింహారావు,పర్షిక రవి,పివైఎల్ రాష్ట్ర నాయకులు వాంకుడో త్ మోతీలాల్,పివైఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉమాశంకర్,గొర్రెపాటి రమేష్,పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్షులు క్రాంతి,పి ఓ డబ్ల్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పి.లక్ష్మక్క,వై.జానకి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎస్కే. సుభాన్,అరుణోదయ జిల్లా కార్యదర్శి ఎనగంటి చిరంజీవి, ఖమ్మం జిల్లా నాయకులు శ్రీకాంత్,పి డి ఎస్ యు పూర్వ రాష్ట్ర నాయకులు తుపాకుల సీతారామరాజు,పి వై ఎల్ జిల్లా నాయకులు ముసలి సతీష్,రావూరి ఉపేందర్ రావు,పి డి ఎస్ యు నాయకులు గాంధీ,రవి వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఉద్యమాభి వందనాలతో.
ఇర్ప రాజేష్
ప్రధానకార్యదర్శి
పి డి ఎస్ యు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ.