*స్టాల్,కోహ్లీ దూకుడు*
*రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించిన ఆర్సిబీ*
ఐపీఎల్ 18వ సీజన్‌లో సొంతగడ్డపై చతికిలప డుతున్న రాయల్ ఛాలెం జర్స్ బెంగళూరు జైపూర్‌లో ఈరోజు అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో విజృంభించిన బెంగళూరు 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై జయభేరి మోగించింది.
174 పరుగుల ఛేదనలో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(65) విధ్వంసక ఆర్ధ శతకంతో మెరిశాడు. సాల్ట్ మెరుపు లతో విజయానికి పునాది వేయగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(62 నాటౌట్, సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(40 నాటౌట్) సైతం దూకుడుగా ఆడాడు. రెండో వికెట్‌కు కోహ్లీతో అబేధ్యమైన 83 రన్స్ జోడించాడు. దాంతో, ఆర్సీబీ నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పుంజుకుంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటింది. జైపూర్ వేదికగా జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల ఛేదనలో ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(65) తనదైన స్టయిల్లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ(62 నాటౌట్) సైతం బౌండరీలతో చెలరేగాడు. సందీప్ శర్మ వేసిన 4వ ఓవర్లో కోహ్లీ గాల్లోకి లేపిన బంతిని అందుకున్న రియా న్ పరాగ్ ఒడిసిపట్టుకోలేక వదిలేశాడు.
ఆ కాసేపటికే సాల్ట్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను సందీప్ క్యాచ్‌ను జారవిడిచాడు. ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న ఈ ఇద్దరు ఆ తర్వాత మరింత వేగంగా ఆడారు. దాంతో, పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ కోల్పోకుండా 65 రన్స్ చేసింది. లైఫ్ లభించడంతో రెచ్చిపోయిన సాల్ట్.. సందీప్ వేసిన 6వ ఓవర్లో సిక్సర్ బాదాడు.
7వ ఓవర్లో బౌండరీతో అర్ధ శతకం సాధించిన సాల్ట్ ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచాడు. అయితే.. కుమార్ కార్తికేయ బౌలింగ్ లో పెద్ద షాట్ ఆడి యశస్వీ చేతికి చిక్కాడు. దాంతో, 92 వద్ద బెంగళూరు మొద టి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(40 నాఔటట్) బౌండరీలతో చెలరేగాడు. సందీప్ వేసిన 18వ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టిన పడిక్కల్ జట్టుకు 9 వికెట్ల విజయాన్ని అందించాడు. నాలుగో విక్టరీతో బెంగ ళూరు జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.