Site icon PRASHNA AYUDHAM

ఏస్ ఎఫ్ ఐ 5వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

IMG 20250205 WA0018

ఏస్ ఎఫ్ ఐ 5వ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి

– కరపత్రాలను ఆవిష్కరించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

ఈనెల 10 ,11 వ తేదీలలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కామారెడ్డి జిల్లా ఐదవ మహాసభల కరపత్రాలను ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంగా స్థానిక కర్షక్ బిఈడి కళాశాలలో రెండు రోజులపాటు జరగనున్నాయని, ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభల్లో చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలను రూపొందిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఎనిమిది వేల కోట్లకు పైగా పెండింగ్లో పెట్టిందని వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు తీష్ట వేశాయని వెంటనే వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రాహుల్ ,సన్నీ , ప్రశాంత్ , రాజు ,శివ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version